ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: నకిలీ మద్యం ప్రాణాంతకంగా మారింది

ABN, First Publish Date - 2023-09-21T17:09:56+05:30

ఏపీలో నకిలీ మద్యం(Fake liquor in AP) ఏరులై పారుతున్న చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeshwari ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

నరసాపురం: ఏపీలో నకిలీ మద్యం(Fake liquor in AP) ఏరులై పారుతున్న చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeshwari ) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు నరసాపురంలో పురంధేశ్వరి పర్యటించారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర మద్యం సీసాలను పగలగొట్టారు. నకిలీ మద్యం సరఫరా చేస్తున్నా సీఎం డౌన్ డౌన్ అంటూ దుకాణం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. గుర్ర బల్ల సెంటర్లోని మద్యం దుకాణాన్ని సందర్శించి అమ్మక వివరాలపై ఆరా తీశారు.లక్ష రూపాయలు అమ్మి 7000 రూపాయలకే బిల్లు ఇవ్వడంపై పురందేశ్వరి విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏపీలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జగన్‌రెడ్డి పూర్తి నిషేధం విధిస్తామని చెప్పి ఇప్పుడు తుంగలో తొక్కారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-21T17:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising