Lokesh: ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం.. కలిసికట్టుగా పోరాటం చేస్తాం
ABN, First Publish Date - 2023-09-14T15:59:56+05:30
రాష్ట్రంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనిపై స్పందిస్తూ... ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకున్నామని.. కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
రాజమండ్రి: రాష్ట్రంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన ప్రకటనిపై స్పందిస్తూ... ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకున్నామని.. కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమన్నారు. జనసేన, టీడీపీ తరపున కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడితే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రజల తరపున పోరాడుతున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టారని అన్నారు. సైకో పోవాలి- సైకిల్ రావాలి పాటకు వైసీపీ శ్రేణులే డ్యాన్స్ చేశాయన్నారు. యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి చేసి... తమపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని.. వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. భీమవరంలో యువగళం పాదయాత్ర (YuvaGalama Padayatra) శాంతియుతంగా చేశామని చెప్పారు. అమరావతి రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు.
సివిల్ వార్ మొదలుపెట్టాల్సిందే...
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది చంద్రబాబు అని యువనేత చెప్పుకొచ్చారు. సైబర్ టవర్స్ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారన్నారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్ వార్ మొదలుపెట్టాలని హెచ్చరించారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా చెమటలు పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కేందుకే జీవో తీసుకువచ్చారుని.. జగన్ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వ్యాఖ్యలు చేశారు.
జైలులో భద్రత ఎలా ఉంటుంది?..
రాజమండ్రి జైలులో గంజాయి స్మగ్లర్లు, నేరస్థులు ఉన్నారని.. చంద్రబాబుకు జైలులో భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల తరపున పోరాడితే అడుగడుగునా అవమానించారన్నారు. ‘‘నా తల్లిని అవమానించారు, నన్ను దూషించారు.. బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు’’ అని అన్నారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదన్నారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నట్లు ఒక్క ఆధారం చూపాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటు అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-14T15:59:56+05:30 IST