AP HighCourt: స్కిల్ కేసులో ఉండవల్లి పిటిషన్‌పై విచారణ 29కి వాయిదా
ABN, First Publish Date - 2023-11-10T12:08:26+05:30
Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణను సీబీఐకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) విచారణను సీబీఐకు (CBI) ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Former MP Undavalli Arunkumar) వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు (AP HighCourt) వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయవాదులు కోర్టు ముందు ప్రస్తావిస్తూ... ఈ నోటీసులు అందరికీ అందలేదని పేర్కొన్నారు. నోటీసులను అందరికీ అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి సూచించారు.
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెండుమూడు రాష్ట్రాలకు విస్తరించి ఉండటంతో కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్‌లో ఉండవల్లి కోరారు. ఆర్థిక పరమైన నేరం, జీఎస్టీ ఎగవేత ఉండటం, ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తుందని, అందువలనే సీబీఐ విచారణకు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఉండవల్లి పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ సంస్థ, ఆ సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44మందిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.
Updated Date - 2023-11-10T12:13:14+05:30 IST