TDP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవేదనభరిత దృశ్యం
ABN, First Publish Date - 2023-09-11T22:58:06+05:30
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవేదనభరిత దృశ్యం ఆవిష్కృతమైంది. సోమవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వచ్చారు.
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవేదనభరిత దృశ్యం ఆవిష్కృతమైంది. సోమవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వచ్చారు. నేతలతో మాట్లాడి తిరిగి సాయంత్రం వెళ్లే సమయంలో కారు ఎక్కేటప్పుడు బాలకృష్ణకు మహిళలు అభివాదం చేశారు.బాలకృష్ణను చూసి చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrested) తమకు తీరని బాధ కలిగించిందని ఒక మహిళ కన్నీటి పర్యంతమైంది. చంద్రబాబును వెంటనే రాజమండ్రి జైలు నుంచి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలని మహిళ ఏడుస్తూ చెప్పింది. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా తాము చూడాలని మహిళ చెప్పింది.ఆమె కన్నీటి పర్యంతమవ్వడంతో బాలకృష్ణ బుజం తట్టి కన్నీరు తుడిచారు. చంద్రబాబు వైపే ధర్మం, న్యాయం ఉందని తప్పనిసరిగా ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా ఆ మహిళను బాలకృష్ణ ఓదార్చారు.
Updated Date - 2023-09-11T22:58:06+05:30 IST