Satyakumar: వైసీపీ సర్కార్‌పై సత్యకుమార్ ఫైర్

ABN , First Publish Date - 2023-06-08T18:04:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Satyakumar: వైసీపీ సర్కార్‌పై సత్యకుమార్ ఫైర్
Satyakumar

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘లక్షల కోట్ల విలువ చేసే లక్షల ఎకరాల భూమిని ఆ స్థాన కంపెనీలు ఇండోసోల్, షిర్డీసాయి, అరబిందోలకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఆర్నెల్ల ముందే కేటాయిస్తూ జీవోలు ఇచ్చి ఇప్పుడు మంత్రిమండలిలో ఆమోదమా? ఈ భూ చోరీ నుంచీ మీడియా, ప్రజల దృష్టిని మరల్చేందుకే పదుల సంఖ్యలో అంశాలతో నిన్న పులిహోర కేబినెట్ సమావేశం జరిపారు! ముఖ్యమైన ఉద్యోగుల సమస్యలను నిన్నటి కేబినెట్ అజెండాలో చేర్చడంలో అంతరార్థం కూడా ఇదే! కేబినెట్ నిర్ణయానికి ముందే భూములు కేటాయిస్తూ తెచ్చిన జీవోలు ఏవి? భూకేటాయింపులు చేయబడ్డ ఆ సంస్థలేవి? వాటి ప్రతిపాదనలు ఏమిటి? కేటాయించిన భూములేవి? భూముల విస్తీర్ణమెంత? వాటి మార్కెట్ విలువెంత? పెడుతున్న పెట్టుబడి ఎంత? వచ్చే ఉద్యోగాలు ఎన్ని? సీఎం @ysjagan సమాధానం చెప్పాలి. తన అవినీతి ఫైల్స్ గుట్టు విప్పాలి.’’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

Updated Date - 2023-06-08T18:39:24+05:30 IST