ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి

ABN, Publish Date - Dec 24 , 2023 | 05:14 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పేర్కొన్నారు.

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పేర్కొన్నారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘3నెలల్లో ఇంటికి పోయే జగన్ రాజధానిని విశాఖపట్నానికి మారుస్తాడట. కోర్టులు చివాట్లు పెట్టినా సీఎం జగన్‌రెడ్డి సిగ్గుపడట్లేదు. తటస్తులను టీడీపీలోకి వస్తాను అంటే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. అక్రమ కేసులకు భయపడి ప్రజలు బయటకు రాకుంటే, మీ జీవితాలకు మీరే మరణ శాసనం రాసుకున్నట్లు అవుతుంది. నేను అందరి వాడిని కానీ ఏ ఒక్కడి వాడిని కాదు. ఎక్కడ సమస్యలు ఉంటే నేను అక్కడ ఉంటాను. 40ఏళ్ల అనుభవంతో కష్టపడతా, ప్రజల కష్టాలు తీరుస్తాను. ఓటమి భయంతోనే తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాపీ కొట్టి అమలు చేస్తానంటున్నాడు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినంత మాత్రాన నిత్యావసరాలు, అధిక బిల్లులు, ధరలు రూపేణా దోచింది తిరిగి ఇస్తాడా ? రాబోయే ఎన్నికలు 5కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మధ్య జరుగుతున్నాయి. జగన్ లా విలువలు లేని రాజకీయాలు ఎవ్వరూ చేయలేదు. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరోధక చర్యలు లేవు’’ అని చంద్రబాబు తెలిపారు.

Updated Date - Dec 24 , 2023 | 05:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising