KVP Comments: వైఎస్ జగన్ పాలనపై కేవీపీ ఎంత మాటన్నారంటే..
ABN , First Publish Date - 2023-01-05T03:07:56+05:30 IST
పోలవరం నిర్వాసితులుగా ఉన్న నాలుగున్నర లక్షల మందికి దారి చూపలేని దీన, హీనస్థితిలో సీఎం జగన్ పాలన ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు.
పోలవరం నిర్వాసితులకూ దారిచూపలేకపోతున్నారు: కేవీపీ రామచంద్రరావు
అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్వాసితులుగా ఉన్న నాలుగున్నర లక్షల మందికి దారి చూపలేని దీన, హీనస్థితిలో సీఎం జగన్ పాలన ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. బుధవారం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో ఏపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై గతంలో చంద్రబాబు, ఇప్పుడు సీఎం జగన్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర విభజన చట్టం మేరకు కేంద్రమే నిర్మించాలని కేవీపీ డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులు నాలుగున్నర లక్షల మందికి జగన్ దారి చూపడం లేదని, కనీసం ప్రోత్సాహకాలు అందించలేని హీన, దీనస్థితిలో ఉన్నారని కేవీపీ అసహనం వ్యక్తం చేశారు. దేశ, రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేసి ప్రతి గడపకూ వెళ్లి.. కాంగ్రె్‌సను బలపరచాలని సూచించారు.