Prathipati: ఎవరి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబు ములాఖత్‌లో కోత?
ABN, First Publish Date - 2023-10-18T15:36:36+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయంలో చట్టం, న్యాయం, నిబంధనలు పాటించట్లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) విషయంలో చట్టం, న్యాయం, నిబంధనలు పాటించట్లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హెల్త్ బులిటెన్ కోసం కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబుకు న్యాయ సహాయం అందకుండా మరో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల్లో కోత విధించారని ప్రశ్నించారు. భువనేశ్వరికి (Nara Bhuvaneshwari) సంఘీభావం తెలపడానికి వెళ్లే వారిపై కేసులు దుర్మార్గమన్నారు. కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) విషయంలో పోలీసుల తీరు అత్యంత హేయమని విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ (YCP) విషప్రచారం కట్టిపెట్టాలని అన్నారు. ప్రజాబలంతోనే త్వరలో వైసీపీని భూస్థాపితం చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.
Updated Date - 2023-10-18T15:36:36+05:30 IST