ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP High Court: ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు హైకోర్ట్ కీలక చర్యలు

ABN, First Publish Date - 2023-12-07T20:32:03+05:30

ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఏపీ హైకోర్ట్ కీలక చర్యలు చేపట్టింది. సుమోటోగా పిల్‌ను హైకోర్టు నమోదు చేసింది. ఇందులో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, స్పెషల్ పీపీ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్‌లను ప్రతివాదులుగా హైకోర్ట్ చేర్చింది.

అమరావతి: ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఏపీ హైకోర్ట్ కీలక చర్యలు చేపట్టింది. సుమోటోగా పిల్‌ను హైకోర్టు నమోదు చేసింది. ఇందులో చీఫ్ సెక్రటరీ, డీజీపీ, స్పెషల్ పీపీ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్‌లను ప్రతివాదులుగా హైకోర్ట్ చేర్చింది. ఈ పిల్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విచారణకు అడ్వకేట్ జనరల్ ఉండాలని ధర్మాసనం అభిప్రాయ పడింది. AG సోమవారం వస్తారని వాయిదా వేయాలని స్పెషల్ పీపీ హైకోర్ట్‌ని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని హైకోర్ట్ పేర్కొంది. కేసుల విచారణ వేగవంతం చేయాలని చెప్పింది.

ట్రయల్ కోర్టులను పర్యవేక్షించేందుకు హైకోర్ట్‌లో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో మినహా ట్రయల్ కోర్టులు విచారణ వాయిదా వేయకూడదని సుప్రీం ఆదేశించింది.మరణశిక్ష, యావజ్జీవ శిక్ష, ఐదేళ్ల పైన శిక్ష పడే కేసులకు విచారణలో ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇప్పటికే స్టే లు ఉన్న కేసుల జాబితాను తయారు చేసి విచారణకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సుప్రీం ఆదేశాలను అమలు చేసేందుకు హైకోర్ట్ సమోటో పిల్ వేసింది.

Updated Date - 2023-12-07T20:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising