Pattabhiram: జగన్ మోసాలు, అబద్ధాల వల్లే ఏపీ రైతు ఆత్మహత్యల్లో ముందుంది
ABN, First Publish Date - 2023-12-07T18:01:07+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) మోసాలు, అబద్ధాల వల్లే ఏపీ రైతు ఆత్మహత్యల్లో దేశంలో ముందుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) వ్యాఖ్యానించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) మోసాలు, అబద్ధాల వల్లే ఏపీ రైతు ఆత్మహత్యల్లో దేశంలో ముందుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( Kommareddy Pattabhiram ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘నాలుగున్నరేళ్లలో జగన్‌రెడ్డి హయాంలో 60లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని.. రైతులు రూ.30వేల కోట్లు నష్టపోయారని కానీ జగన్ వారికి చెల్లించిన పంటల బీమా సాయం సున్నా. 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2019 వరకు చంద్రబాబునాయుడు రైతులకు రూ.3569 కోట్ల బీమా సొమ్ము చెల్లించారు. 2018-19లో చెల్లించిన ప్రీమియం కంటే అదనంగా 100 శాతం కంటే ఎక్కువగా దేశంలోనే అత్యధికంగా 172.8 శాతం ఇన్సూరెన్స్ సొమ్ముని రైతులకు చెల్లించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. చెల్లించిన ప్రీమియం కంటే అదనంగా 172..8 శాతం సొమ్ము రూ.1885కోట్లను 16లక్షల మంది రైతులు చంద్రబాబు హయాంలో నష్టపరిహారంగా పొందారు. ఈ వివరాలు అన్నీ కేంద్ర వ్యవసాయ శాఖ వార్షిక నివేదిక (2022-23) లోనే ఉన్నాయి’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
రైతులకు చెల్లించిన పంటల బీమా సొమ్మును బయట పెట్టాలి
‘‘చంద్రబాబు హయాంలో దేశంలోనే అత్యధికంగా 16లక్షల మంది రైతులు క్లెయిమ్ సొమ్ము పొందితే .. నేడు జగన్ జమానాలో 2023 ఖరీఫ్ సీజన్లో కేవలం 16 మంది రైతులకే ప్రీమియం కట్టే దుస్థితికి దిగజారింది. ఇదేనా జగన్ పదేపదే చెప్పే రైతు పక్షపాతం. నాలుగున్నరేళ్లలో జగన్ తాను రైతులకు చెల్లించిన పంటలబీమా సొమ్ము ఎంతో తక్షణమే బయటపెట్టాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి తప్పుకొని తానే స్వయంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పెట్టి రైతులకు బీమా సాయం చెల్లిస్తానని జగన్ ప్రగల్భాలు పలికి అదీ చేయలేదు. ఐ.ఆర్.డీ.ఏ.ఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) వెబ్ సైట్లో జగన్ రైతులకోసం పెడతానన్న ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ ఎక్కడా లేదు. దేశంలో పబ్లిక్.. ప్రైవేట్ సెక్టార్లలో లైసెన్స్ పొందిన ఇన్సూరెన్స్ కంపెనీలు 34 ఉంటే వాటిలో ఎక్కడా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరే లేదు. 2019 నుంచి 2023వరకు ఎంతమంది రైతులకు ఎంత బీమా ప్రీమియం జగన్ చెల్లించాడో.. పంటలు నష్టపోయిన రైతులకు ఎంత సొమ్ము చెల్లించాడో పూర్తి వాస్తవాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రైతులపై తనకున్న చిత్తశుద్ధి ఏమిటో జగన్ అన్నదాతల సాక్షిగా నిరూపించుకోవాలి’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-12-07T22:55:50+05:30 IST