Ambati: మానవ ప్రేరేపితంతోనే తొక్కిసలాటలు

ABN , First Publish Date - 2023-01-03T12:27:50+05:30 IST

మానవ ప్రేరేపితంతోనే చంద్రబాబు (Chandrababu) సభల్లో తొక్కిసలాటకు కారణమని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. మంత్రి మీడియాతో

Ambati: మానవ ప్రేరేపితంతోనే తొక్కిసలాటలు
రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటం దేనికి?

గుంటూరు: మానవ ప్రేరేపితంతోనే చంద్రబాబు (Chandrababu) సభల్లో తొక్కిసలాటకు కారణమని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘జనవరి 1న గుంటూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం. గాయపడిన 19 మందికి రూ.50 వేలు చొప్పున అందజేశాం. తొక్కిసలాట మానవ ప్రేరితమైన దుర్ఘటన. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే తొక్కిసలాటలో ముగ్గురు మరణించేవారు కాదు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు దుప్పట్లు, కానుకలు పంచటానికి రావాలా?. గంటల కొద్దీ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటం దేనికి?. మాకూ ప్రజా బలం ఉందని చెప్పటానికి ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి డ్రోన్ కెమెరాల (Drone cameras)తో షూట్ చేస్తున్నారు. 30 వేల మందిని తెచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా? పైగా జగన్ ప్రభుత్వం (Jagan Govt.) వల్లే తొక్కిసలాట జరిగిందని తమపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు పాల్గొన్న మూడు కార్యక్రమాల్లో తొక్కిసలాటలు జరిగాయి. చంద్రన్న (Chandranna) విరామం కార్యక్రమం ప్రకటించాలి.’’ అని అంబటి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-01-03T12:30:15+05:30 IST