AP NEWS: పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి మిశ్రమ స్పందన
ABN , First Publish Date - 2023-08-20T00:31:19+05:30 IST
ఏపీలో కొన్ని జిల్లాల్లో సర్పంచ్ పదవుల(Sarpanch posts)కు ఉప ఎన్నికలు(By-Elections) జరిగాయి. కొద్ది సేపటి క్రితం ఈ ఫలితాలు వచ్చాయి. వైసీపీ, తెలుగుదేశం, జనసేన పోటాపోటీగా తలపడ్డాయి.
అమరావతి: ఏపీలో కొన్ని జిల్లాల్లో సర్పంచ్ పదవుల(Sarpanch posts)కు ఉప ఎన్నికలు(By-Elections) జరిగాయి. కొద్ది సేపటి క్రితం ఈ ఫలితాలు వచ్చాయి. వైసీపీ, తెలుగుదేశం, జనసేన పోటాపోటీగా తలపడ్డాయి. గుంటూరు జిల్లా(Guntur District)లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీకి మూడు రాగా.. టీడీపీ, జనసేన చెరొకటి గెలిచాయి. పల్నాడు జిల్లాలో 48 వార్డులకు ఉపఎన్నికలు జరిగాయి. 48 స్థానాల్లో 33 స్థానాలు ఏకగ్రీవం, ఒక స్థానంలో ఎన్నికను అధికారులు రద్దు చేశారు.14 స్థానాల్లో జరిగిన ఎన్నికలో టీడీపీ మద్దతుదారులు 6 గెలవగా.. వైసీపీ అభ్యర్థులు 8 చోట్ల గెలుపొందారు.గుంటూరు జిల్లాలో 27 వార్డులకుగానూ టీడీపీ సానుభూతిపరులు -11 వైసీపీ మద్దతుదారులు- 14 స్థానాల్లో.. జనసేన అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధించారు. బాపట్ల జిల్లాలో 35 వార్డులకు గానూ.. వైసీపీ మద్దతుదారులు 20.. టీడీపీ సానుభూతిపరులు 15 వార్డుల్లో గెలుపొందారు.