ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Manthena Ramaraju: పెళ్లిరోజున చంద్రబాబును జైలుకు పంపాలనే.. ఇలా చేశారు

ABN, First Publish Date - 2023-09-10T20:23:37+05:30

చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ని ఇరికించాలని, 16 గంటలైనా జైలులో ఉంచాలని జగన్మోహన్‌రెడ్డి( JAGAN REDDY GOVT) ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు(MLA Manthena Ramaraju) అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)ని ఇరికించాలని, 16 గంటలైనా జైలులో ఉంచాలని జగన్మోహన్‌రెడ్డి( JAGAN REDDY GOVT) ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు(MLA Manthena Ramaraju) అన్నారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మచ్చలేని వ్యక్తి. చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తాం.. తమకు న్యాయం జరుగుతుంది. పెళ్లిరోజున జైలుకు పంపాలని ప్రిప్లాన్డ్‌గా చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలు చేస్తామని మంతెన రామరాజు పిలుపునిచ్చారు.

చంద్రబాబుపై కక్షపూరితంగానే అక్రమ కేసులు: ఎమ్మెల్యే రామానాయుడు

పశ్చిమ గోదావరి జిల్లా, (పాలకొల్లు): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం(YCP Govt) కక్షపూరితంగానే అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 2021లో నమోదు చేసిన కేసులో నిందితులందరికీ ఇప్పటికే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ మొదటి నుంచి ఈకేసు ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు ఇప్పుడు కక్ష సాధింపుతోనే పేరు చేర్చి ఇరికించారు. కోర్టు తీర్పు రిజర్వు చేసినప్పటికీ కేవలం చంద్రబాబును జైలుకు పంపడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పని చేసింది. జగన్ గతంలో 16 నెలలు జైల్లో జీవితం గడిపారని నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో ఉంచాలని దుర్బుద్ధితో ఆయనను ఈ కేసులో ఇరికించారు. 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క అవినీతి ఆరోపణ కూడా చంద్రబాబు ఎదుర్కోలేదని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-10T20:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising