ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Raghurama: షర్మిల కాంగ్రెస్‌తో కలిస్తే.. వైసీపీకి ఇబ్బందే..

ABN, First Publish Date - 2023-08-11T15:37:19+05:30

వైఎస్ షర్మిల(YS Sharmila) తన పార్టీని కాంగ్రెస్‌(Congress)లో విలీనం చేస్తే వైసీపీ(YCP)కి ఏపీ(AP)లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(YCP rebel MP Raghurama Krishnaraju) అన్నారు.

ఢిల్లీ(Delhi): వైఎస్ షర్మిల(YS Sharmila) తన పార్టీని కాంగ్రెస్‌(Congress)లో విలీనం చేస్తే వైసీపీ(YCP)కి ఏపీ(AP)లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(YCP rebel MP Raghurama Krishnaraju) అన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ ఒక వేళ షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్తే తన తండ్రి(వైఎస్సార్) రుణం తీర్చుకున్నట్లు ఉంటుంది. జగన్‌(Jagan) వైఖరీని చూసి రాజశేఖర్‌రెడ్డి పైన నించి దిగి వస్తే ఖచ్చితంగా ఓటు వేయరు. విశాఖపట్నంలో వారాహి 3 యాత్ర ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ రుషికొండ‌(Rushikonda)కు పవన్ కళ్యాన్‌ను వెళ్లనివ్వరు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిరునవ్వులతో వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై పిడుగులు కురిపించారు.లిక్కర్ 35 వేల కోట్లు కొట్టేస్తున్నరని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్‌ను సమర్థిస్తాను. రుషికొండ‌లో కట్టేది ఆఫీసులు కాదు, జగన్ ఇల్లు. అక్కడకి పవన్ కళ్యాణ్ వెళ్తే కట్టేది ఇల్లు అనేది అందరికీ తెలుస్తుంది.వైఎస్ భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం బాగోలేదని బెయిల్ వేశారు.ఇంట్లో బాగోలేదని ఇంకొకరు బెయిల్ పిటిషన్ వేశారు.చూస్తుంటే ఒంట్లో బాగోలేని వారికి బెయిల్ ఇవ్వొచ్చని అనుకుంటున్నాను. ఎంపీ, ఎమ్మెల్యేల కేసు కాకపోయినా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్‌కి పిటిషన్ వేశారు..ఇది సమంజసమా అనేది చూడాలి. సునీత రెడ్డి అడగాల్సిన అంశాలు ఇవ్వన్నీ. అజయ్ క్లలం ఇప్పుడు పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు. కేసు ఫైనల్‌కి వచ్చినప్పుడు చెప్తే సరిపోయేది’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.


లోక్‌సభలో చారిత్రాత్మక బిల్లు

లోక్‌సభలో చారిత్రాత్మక బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.‘‘ఐపీసీ ,సీఆర్పీసీ,ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త బిల్లులు తీసుకొచ్చారు.రాజద్రోహం కేసులు పెట్టడానికి వీలు లేకుండా కొత్త బిల్లులు స్టాండింగ్ కమిటీకి వెళ్లాయి.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందుతాయి.ఇలాంటి దరిద్రపు బిల్లులు ఏపీలో లేకుండా కేంద్రం చట్టం తీసుకొస్తుంది.పోలీసు స్టేషన్‌లో కెమెరాలు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది.విచారణలో వీడియో రికార్డ్ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై చండ్రని నిప్పులు చెరిగారు.చంద్రబాబు యాత్రలు ఎప్పుడు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

Updated Date - 2023-08-11T16:28:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising