Nadendla Manohar: జనసేన-తెలుగుదేశం పొత్తుకు జనామోదం ఉంది
ABN, First Publish Date - 2023-09-28T21:59:32+05:30
జనసేన-తెలుగుదేశం(Janasena-Telugudesam) పొత్తుకు జనామోదం ఉందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
అమరావతి: జనసేన-తెలుగుదేశం(Janasena-Telugudesam) పొత్తుకు జనామోదం ఉందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు. గురువారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వారాహి యాత్ర అక్టోబర్ 1వ తేదీన అవనిగడ్డలో ప్రారంభం అవుతుంది. కార్యక్రమాల నిర్వహణ కమిటీతో చర్చించిన తర్వాత ప్రకటిస్తాం. వారాహి యాత్రలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేలా నాయకులు కృషి చేయాలి. ఆశేషంగా వచ్చే ప్రజలు కోసం తగిన ఏర్పాట్లు చేయాలి. విస్తృత స్థాయి సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాం.ఇరు పార్టీల నాయకులు చర్చించుకునే అవకాశం రాలేదు.ప్రస్తుతానికి ఉమ్మడి కార్యాచరణ సాధ్యం కాలేదు. తెలుగుదేశం చేస్తున్న ఆందోళనలకు జనసేన మద్దతు ఉంటుంది. తెలుగుదేశం నాయకులతో ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా చక్కటి సమన్వయంతో సానుకూల దృక్పథంతో సంప్రదింపుల ద్వారా ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించాలి.త్వరలోనే ఉమ్మడి కార్యచరణ ప్రకటిస్తాం. అప్పటి వరకు సమయానుకూలంగా పార్టీ నియమావళికి లోబడి ముందుకు వెళ్లాలి. పొత్తు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాబోయే ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం పార్టీలు కలసి పోటీ చేస్తాయి. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ఈ సమావేశం ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-28T21:59:32+05:30 IST