Nadendla Manohar: తెలుగుదేశం వెంట నడవాలి
ABN, First Publish Date - 2023-10-02T21:05:08+05:30
తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా వారితో నిలబడండి.. మన కార్యక్రమాలకు వాళ్లని ఆహ్వానించండి అని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా వారితో నిలబడండి.. మన కార్యక్రమాలకు వాళ్లని ఆహ్వానించండి అని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ...‘‘బ్యానర్లు, ఫొటోలు వేసుకున్నంత మాత్రాన లీడర్లు అయిపోయాం అనుకోవద్దు. నాయకుడు ఏం చెబుతున్నాడో ఆ విషయాన్ని ప్రచారం చేయండి. చిన్న వర్షం పడితే రాష్ట్రంలో మొదటి ఫొటో మచిలీపట్నం నుంచే వచ్చేది. టీడీపీతో పొత్తుకి వెళ్లాం, ఆయన మన భవిష్యత్ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నంలో ఎవరు అభ్యర్థి ఎవరు, ఎవరు పోటి చేస్తారనేది మనం తీసుకొనే నిర్ణయం కాదు. పవన్ సమయం వచ్చినప్పుడు తీసుకుంటారు. అవనిగడ్డలో మనకి ఐదేళ్లుగా ఇన్‌చార్జ్ లేరు. కాని కార్యకర్తలతో సభ పెట్టాం. ఎవరైనా ఇలా సభ పెట్టగలరా..?. సోషల్ మీడియాను మన కార్యక్రమాల కోసం ఉపయోగించండి విమర్శల కోసం కాదు. పార్టీ ఆదేశాలమేరకు మనం నిలబెట్టే అభ్యర్థి కోసం బూత్ లెవల్‌లో కష్టపడాలి. రాష్ట్రం క్షేమం కోసం, భవిష్యత్తు తరాల కోసం జనసేనను గెలిపించాలి’’ అని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
Updated Date - 2023-10-02T21:05:08+05:30 IST