Nandamuri Ramakrishna: చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు
ABN, First Publish Date - 2023-09-20T22:19:27+05:30
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Nara Chandrababu Naidu Illegal Arrest)పై పలు పార్టీలు ఖండిస్తున్నాయి.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Nara Chandrababu Naidu Illegal Arrest)పై పలు పార్టీలు ఖండిస్తున్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అరెస్ట్‌ను ముక్తఖంఠంతో ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ పద్ధతుల్లో రోజుకోక విధంగా ఆందోళనలు చేపడుతున్నారు. కాగా.. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నందమూరి రామకృష్ణ(Nandamuri Ramakrishna) తీవ్రంగా ఖండించారు. బుధవారం నాడు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై రాజకీయ కక్షతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమ కేసులు బనాయించారు. చంద్రబాబుకు సంఘీభావంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేస్తామన్నజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు. మళ్లీ చంద్రబాబుని సీఎంగా గెలిపించుకోవాలని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-20T22:19:27+05:30 IST