ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: స‌త్యం గెలిచింది.. అస‌త్యంపై యుద్ధం మొద‌ల‌వ‌బోతోంది

ABN, First Publish Date - 2023-11-20T17:19:59+05:30

చంద్రబాబును అరెస్టు చేసి 50 రోజుల‌కు పైగా జైల్లో పెట్టి క‌నీసం ఒక్క ఆధార‌మూ ఇప్పటికీ కోర్టు ముందు ఉంచ‌లేక‌పోయినా త‌ప్పుడు కుట్రలు న్యాయం ముందు బ‌ద్దల‌య్యాయి.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు‌కు (Chandrabab) రెగ్యులర్ బెయిల్ రావడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ లోకేశ్ ప్రకటన విడుదల చేశారు. ‘‘స‌త్యం గెలిచింది.. అస‌త్యంపై యుద్ధం మొద‌ల‌వ‌బోతోంది. మ‌న నాయ‌కుడు చంద్రబాబు క‌డిగిన ముత్యమే. ‘‘స‌త్యమేవ‌జ‌య‌తే’’ మ‌రోసారి నిరూపిత‌మైంది. ఆల‌స్యమైనా స‌త్యమే గెలిచింది. జ‌గ‌న్ క‌నుస‌న్నల్లో వ్యవ‌స్థల మేనేజ్‌మెంట్‌పై స‌త్యమే గెలిచింది. చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మ‌రోసారి స‌మున్నతంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డింది. ‘‘నేను త‌ప్పు చేయ‌ను, త‌ప్పు చేయ‌నివ్వను’’ అని చంద్రబాబు ఎప్పుడూ చెప్పేదే మ‌రోసారి నిజ‌మైంది. చంద్రబాబుపై పెట్టిన‌ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు జ‌గ‌న్ కోసం(CM Jagan). వ్యవ‌స్థల ద్వారా బ‌నాయించింద‌ని బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.’’ అని తెలిపారు.

‘‘చంద్రబాబును అరెస్టు చేసి 50 రోజుల‌కు పైగా జైల్లో పెట్టి క‌నీసం ఒక్క ఆధార‌మూ ఇప్పటికీ కోర్టు ముందు ఉంచ‌లేక‌పోయినా త‌ప్పుడు కుట్రలు న్యాయం ముందు బ‌ద్దల‌య్యాయి. కేసులో ఆరోపించిన‌ట్టు షెల్ కంపెనీలు అనేవి లేవ‌ని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి (TDP) డబ్బులు ప‌డ్డాయ‌నేది ప‌చ్చి అబ‌ద్ధమ‌ని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూట‌క‌మ‌ని స్పష్టమైంది. చంద్రబాబుకి రూపాయి కూడా రాని స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చార‌నేది అవాస్తవ‌మ‌ని న్యాయ‌స్థానమే తేల్చేసింది. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కీమ్‌ని స్కాంగా మార్చేసి చంద్రబాబు 45 ఏళ్ల క్లీన్ పొలిటిక‌ల్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డానికి జ‌గ‌న్ అండ్ కో ప‌న్నాగ‌మ‌ని దేశ‌మంత‌టికీ తెలిసింది. హైకోర్టు వ్యాఖ్యల‌తో క‌డిగిన ముత్యంలా చంద్రబాబు ఈ కుట్రకేసుల‌న్నింటినీ జ‌యిస్తారు. స‌త్యం గెలిచింది. జ‌గ‌న్ అనే అస‌త్యంపై యుద్ధం ఆరంభం కానుంది.’’ అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

Big Breaking: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-20T17:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising