ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Payyavula Keshav: సీమెన్స్‌ సంస్థను ప్రతివాదిగా ప్రభుత్వం ఎందుకు చేర్చలేదు

ABN, First Publish Date - 2023-09-13T13:31:51+05:30

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) సీమెన్స్‌ సంస్థను ప్రతివాదిగా ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌(Payyavula Keshav) వ్యాఖ్యానించారు.

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) సీమెన్స్‌ సంస్థను ప్రతివాదిగా ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని తెలుగుదేశం సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌(Payyavula Keshav) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకు (Chandrababu) అవినీతి మరకను అంటించడానికి జగన్‌ కుట్ర పన్నారు.అక్రమ కేసులకు టీడీపీ భయపడదు. రేపు రాజకీయ రణక్షేత్రంలో టీడీపీ పదింతలు శక్తితో ఎదుర్కొంటుంది.ప్రభుత్వం, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ ఒప్పందం చేసుకున్నాయి. సీమెన్స్‌ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ప్రశ్నించేవారిని అరెస్ట్‌ చేస్తారా? ఇలానే చేసుకుంటే పోతే రెండు సీట్లకే పరిమితమవుతారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తారా?.వైసీపీ ప్రభుత్వం సీమెన్స్‌ పనితీరు బాగుందని సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అన్ని అందాయని చెబుతున్నారు.నిధులు గోల్‌మాల్‌ జరిగినట్టు నిరూపించలేకపోయారు. ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించగలరా?. నాలుగేళ్లలో ఏ ఒక్కరోజైనా చంద్రబాబుకు నోటీసు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.కోర్టుకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సీమెన్స్‌ను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకురావట్లేదు’’ అని పయ్యావుల కేశవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-13T13:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising