Kanna Lakshmi Narayana: కుట్రతోనే గన్‌మెన్లు తొలగించారు
ABN, First Publish Date - 2023-07-24T14:56:16+05:30
కుట్రలో భాగంగానే నాకు గన్‌మెన్లను తొలగించారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నానని ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడింది. పల్నాడు జిల్లాలో భద్రతపరంగా నాకు ఇబ్బందులు ఉన్నా గన్‌మెన్లను విత్ డ్రా చేశారు. ప్రజలు జగన్‌కు మంచి మెజార్టీ ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయారు.
గుంటూరు: జగన్ సీఎం (CM jagan) అయ్యాక ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ (TDP leader Kanna Lakshmi Narayana) ధ్వజమెత్తారు. వైసీపీ సర్కార్ గన్‌మెన్ల తొలగించడంపై మీడియాతో మాట్లాడారు. ‘‘కుట్రలో భాగంగానే నాకు గన్‌మెన్లను తొలగించారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నానని ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడింది. పల్నాడు జిల్లాలో భద్రతపరంగా నాకు ఇబ్బందులు ఉన్నా గన్‌మెన్లను విత్ డ్రా చేశారు. ప్రజలు జగన్‌కు మంచి మెజార్టీ ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, దోపిడీ, హత్యలు తప్ప మరో కార్యక్రమం లేదు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా జగన్‌ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.’’ అని కన్నా వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-07-24T14:56:16+05:30 IST