ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nakka Anand: చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి అందుకోసమే అన్న టీడీపీ నేత

ABN, First Publish Date - 2023-04-22T09:49:29+05:30

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు (TDP Leader Nakka Anandbabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆదిమూలపు సురేష్ (AP Minister Adimulapu Suresh) వీధి రౌడీలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. దాడులు జరుగుతాయి అని ముందే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎన్‌ఎస్‌జీ కమెండోలు అడ్డులేకపోతే చంద్రబాబు నాయుడు (TDP Chief) మీద రాళ్ల దాడి జరిగేదని.. కామండో తలకి గాయం పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. దళితులను లోకేష్ (Nara Lokesh) అవమానించారని అసత్య ఆరోపణలతో మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Minister) తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీధి రౌడీల ప్రవర్తించారని మండిపడ్డారు. తక్షణమే మంత్రి పదవి నుంచి సురేష్‌ను గవర్నర్ బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చొక్కా విప్పి రోడ్డుపై వీరంగం చేయడం శోచనీయమన్నారు. ఈ కుట్రలో పోలీసులు కూడా భాగాస్వామీలే అని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్టులు చేసి హడావిడి చేసే పోలీసులు మంత్రిని మాత్రం దగ్గర ఉండి దాడి చేయించారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా వివేకా హత్య కేసులను పక్క దారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ అని వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిపై సాక్షాత్తు రాష్ట్ర మంత్రి దాడి చేయడం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఈ దాడిని ప్రజాస్వామ్య వాదులు, ప్రజాసంఘాలు ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని నక్కా ఆనంద బాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-22T09:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising