Somireddy: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ సోమిరెడ్డి
ABN, First Publish Date - 2023-09-19T14:23:22+05:30
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరం. చేతిలో అధికారం ఉందని ఎలా పడితే అలా చేస్తాననడం జగన్ రెడ్డికి తగదు. పుంగనూరు, అంగళ్లు ఘటనకి సంబంధించి పీలేరు నియోజకవర్గంలో 140 మంది నాయకులపై ఏరిఏరి మూడు రోజుల క్రితం నాన్ బెయిలబుల్
అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై (Ycp Government) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీలో ప్రజాస్వామ్యం జగన్ రెడ్డి (CM jagan) కాళ్ల కింద పడి బతికుందో, చచ్చిందో అర్థం కావడం లేదు. నిరసన తెలపకూడదంట.. నిరాహార దీక్షకు కూర్చోకూడదంట. ర్యాలీ చేయకూడదంట. చివరకు మేము దేవాలయాలను కూడా సందర్శించి పూజలు చేయకూడదంట.. అంత భయమెందుకు జగన్ రెడ్డీ. మీ దుర్మార్గాలపై దేవుడు కన్నెర్ర చేస్తారని వణికిపోతున్నారా?, ఇది ఏపీ అనుకుంటున్నారా?.. లేక నార్త్ కొరియాగా భావిస్తున్నారా?, జగన్ రెడ్డి దుర్మార్గాలకు పోలీసులు వంతపాడటం దురదృష్టకరం.. మిమ్మల్ని కొట్టి తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 1947కి ముందు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన తరహాలోనే ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాల నుంచి విముక్తికి పోరాటం చేయాల్సి వస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేక ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడింది.’’ అని పేర్కొన్నారు.
‘‘అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరం. చేతిలో అధికారం ఉందని ఎలా పడితే అలా చేస్తాననడం జగన్ రెడ్డికి తగదు. పుంగనూరు, అంగళ్లు ఘటనకి సంబంధించి పీలేరు నియోజకవర్గంలో 140 మంది నాయకులపై ఏరిఏరి మూడు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జగన్ రెడ్డి అరాచకాలకు పరాకాష్ట. ఇంకా ఎన్ని వేల మందిపై అక్రమ కేసులు బనాయించాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి సెక్షన్లు, హత్యాయత్నం సెక్షన్లు టీడీపీ శ్రేణులకే వర్తిస్తాయా?.. మా నాయకులు, కార్యకర్తలపైనే కేసులు బనాయిస్తారా?, తప్పు చేయకపోయినా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారు. 409, 17ఏ సెక్షన్లను కూడా ప్రయోగిస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని దుర్మార్గాలు చేసినా వారికి మాత్రం ఐపీసీ సెక్షన్లు వర్తించవు. ఈ రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే కేంద్రం ఎందుకు కళ్లు మూసుకుని కూర్చుందో అర్థం కావడం లేదు. ఏపీ ప్రజలు భారతదేశం పౌరులు కాదా?, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దుర్మార్గాలన్నింటిని భగవంతుడు చూస్తున్నాడు.. తగు సమయంలో స్పందిస్తారనే నమ్మకం మాకుంది.’’ సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-19T14:23:22+05:30 IST