ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: ఏపీలో ప్రజాస్వామ్యం అదుపు తప్పింది

ABN, First Publish Date - 2023-09-13T18:15:59+05:30

పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు నిరసన తెలియజేయడానికి వస్తే లాఠీతో వీరవిహారం చేశారు. కార్యకర్తల్ని గొడ్డును బాదినట్లు బాదాడు. ఇతనిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంతటి అత్యుత్సాహం చూసిన పోలీస్ ఆఫీసర్లపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏం చర్యలు తీసుకుంటారని

అమరావతి: ఏపీలో ప్రజాస్వామ్యం అదుపు తప్పిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ప్రజా జీవనం స్తంభించేలా వైసీపీ (YCP Government) వ్యవహరించింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో విజ్ఞులు గ్రహించాలి. ప్రజాస్వామ్యాన్ని అదుపుచేసే నాథుడు కరవయ్యాడు. చంద్రబాబును (Chandrababu) నంద్యాల నుంచి వెహికల్‌లో విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళ్తున్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం. అత్యుత్సాహం చూపిస్తున్న అధికారుల చిట్టా తయారు చేస్తున్నాం. సరైన సమయంలో గుణపాఠం చెబుతాం. కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులా?, జగన్‌కు (Cm jagan) తాబేదారులా? అర్థం కావడంలేదు. జగన్ అరెస్టుకు నిరసనగా సత్తెనపల్లిలో ఆందోళనకు దిగిన కార్యకర్తలపై డీఎస్పీ, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం. సత్తెనపల్లిలో టీడీపీ కార్యకర్త మెడపై డీఎస్పీ మోకాలితో తొక్కిపెట్టడం హేయమైన చర్య. డీజీపీ వెంటనే అతనిని సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. డీజీపీకి ఫిర్యాదు చేద్దామంటే ఆయన జగన్ సేవలో తరిస్తున్నారు. అమెరికా పోలీస్ ఆఫీసర్ అలెగ్జాండర్ ఇలా చేసినందుకు 66 ఏళ్లు జైలు శిక్ష విధించారు.’’ అని వర్ల రామయ్య గుర్తుచేశారు.

‘‘పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు నిరసన తెలియజేయడానికి వస్తే లాఠీతో వీరవిహారం చేశారు. కార్యకర్తల్ని గొడ్డును బాదినట్లు బాదాడు. ఇతనిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంతటి అత్యుత్సాహం చూసిన పోలీస్ ఆఫీసర్లపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి నాయకుడిని చూడటానికి రోడ్డుపైకి వస్తే వారిని పశువులను కొట్టినట్లు కొడతారా? మీరు పోలీసులా, జగన్ తాబేదారులా? చంద్రబాబును అరెస్టు చేస్తే ఓ మహిళా మంత్రి స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చుతూ రోడ్డుపై నృత్యం చేయడాన్ని బట్టి ఆమెకు చంద్రబాబుపై ఎంతో ద్వేషం ఉందో అర్థమైంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన నాయకుడు భార్య గురించి ఆ మహిళా వెకిలి మంత్రి తప్పుగా మాట్లాడుతారా? ఈ మహిళా మంత్రి చరిత్ర బయటికి తీశాం. చెన్నైలో ఎన్ని ఆస్తులు కొన్నారో దస్తావేజులతో సహా సేకరించాం. పూనమలై హైవే దగ్గర ఎన్ని ఎకరాల భూములు కొన్నారో అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆమెను జైలుపాలు చేస్తాం. పేర్ని నాని, అమర్నాథ్, అంబటి రాంబాబు చిట్టా కూడా మా వద్ద ఉంది. అధికారంలోకి రాగానే వారికి కూడా రాజమండ్రి జైలులో చిప్ప కూడు తినిపిస్తాం. ఏం సాధించారని సిట్ అధికారులు.. సిట్ కార్యాలయంలో స్వీట్లు పంచుకుంటారు? జగన్ కొట్టేసిన రూ.43 వేల కోట్లు రికవరీ చేశారని స్వీట్లు పంచుకున్నారా? హుందాగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి అధికారులను పిలిచి వారికి స్వీట్లు తినిపించడం సబబా? న్యాయం, ధర్మం గెలుస్తాయని మేం నమ్ముతున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును చూసి జగన్ సంతోషిస్తున్నారు. జగన్ వ్యవహారశైలి అభ్యంతరకరం. టీడీపీ విజయాన్ని సాధిస్తుంది. అధికారంలోకి వస్తుంది, మీ భరతం పడతాం. తప్పు చేసిన అధికారులందరికి టీడీపీ తగిన గుణపాఠం చెబుతుంది.’’ అని వర్ల రామయ్య హెచ్చరించారు.

Updated Date - 2023-09-13T18:15:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising