ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devineni Uma: కోడి కత్తి డ్రామాలు ఆడి జగన్ సీఎం అయ్యారు

ABN, First Publish Date - 2023-09-28T14:24:59+05:30

కోడి కత్తి డ్రామాలు ఆడి జగన్ సీఎం అయ్యారు. పట్టిసీమ కట్టినోడు జైలులో ఉంటే పైపులు పికుతాను అన్నోడు అధికారంలో ఉన్నాడు. బాబాయ్ హత్య కేసును పక్కదారి పట్టించడానికే చంద్రబాబుపై కేసులు. తెలుగుదేశం పార్టీ

అమరావతి: రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ మోహన్ రెడ్డి (Cm jagan) చంద్రబాబుపై (Chandrababu) కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా (YSR) ఉన్నప్పుడు జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారని సీబీఐ కేసు పెట్టింది. రూ.43 వేల కోట్లు సీబీఐ అధికారులు జప్తు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా చంద్రబాబుని అరెస్టు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల ఏం చెబితే అదే పోలీసులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ చర్యలను ఖండిస్తే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.’’ అని ధ్వజమెత్తారు.

జగన్.. అలా సీఎం అయ్యారు..

‘‘కోడి కత్తి డ్రామాలు ఆడి జగన్ సీఎం అయ్యారు. పట్టిసీమ కట్టినోడు జైలులో ఉంటే పైపులు పికుతాను అన్నోడు అధికారంలో ఉన్నాడు. బాబాయ్ హత్య కేసును పక్కదారి పట్టించడానికే చంద్రబాబుపై కేసులు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగు వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. లోకేశ్ పాదయాత్రను (Nara lokesh) అడ్డుకోవడానికి ఆయనపై కేసులు పెట్టారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. భోజనానికి టేబుల్ ఏర్పాటు చేయమని కోరితే కోర్టు చెబితే చేస్తాం అంటున్నారు. కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి వైసీపీ చేస్తున్న ఆరాచకాలు వివరించాలి. తప్పుడు ఓట్లు రాష్ట్రంలో చేర్పిస్తున్నారు. నూతన సాంకేతికతను ఉపయోగించి తప్పుడు ఓట్లు చేరుస్తున్నారు. దీన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవాలి. భారత రాజ్యాగాన్ని మనందరం రక్షించాలి.’’ అని దేవినేని ఉమ కోరారు.

Updated Date - 2023-09-28T14:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising