ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jana Sena: జనసేన నేతల అత్యవసర భేటీ.. కారణమేంటంటే..?

ABN, First Publish Date - 2023-10-17T16:37:08+05:30

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) .. ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ( Nadendla Manohar ) తో జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) .. ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ( Nadendla Manohar ) తో జనసేన పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణపై చర్చించారు. అలాగే జనసేన - తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై చర్చించారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం పై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల పక్షాన చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమం గాపెడుతున్న కేసులపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.

Updated Date - 2023-10-17T16:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising