Cm Ramesh: సీఎం జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయి
ABN, First Publish Date - 2023-11-21T15:08:53+05:30
మీడియా వల్లే బీటెక్ రవి బయట పడ్డారు. వైసీపీకి (Ycp Government) తొత్తుగా కడప ఎస్పీ, సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నా రు. పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం.
కడప: టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవిని (BTech Ravi) అరెస్టు చేసిన విధానంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (BJP MP Cm Ramesh) తెలిపారు. కడప సెంట్రల్ జైల్లో బీటెక్ రవిని సీఎం రమేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈనెల 14న బీటెక్ రవిని కిడ్నాప్ చేసి పోలీసులు చంపేయాలకున్నారు. పేరుకు యువగళం పాదయాత్ర కేసుగా చూపించారు. కడప నగర శివార్లలో వాహనంలో నుంచి దింపి పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు. ఆ తర్వాత పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారు. బ్రతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది. పులివెందులలో అంత పెద్ద ఆఫీస్ ఎందుకు పెట్టావు?, సునీతమ్మ, లూథ్రాలు ఏమైనా చేస్తామని చెప్పారా? అంటూ బీటెక్ రవిని పోలీసులు బెదిరించారు.’’ అని ఆరోపించారు.
‘‘మీడియా వల్లే బీటెక్ రవి బయట పడ్డారు. వైసీపీకి (Ycp Government) తొత్తుగా కడప ఎస్పీ, సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నా రు. పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం. పోలీసులు చిన్న చిన్న లాభాల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పోగోట్టుకోకండి. ఈ ఘటనపై సీరియస్‌గా తీసుకుంటాం. అశోక్ రెడ్డి అండ్ టీమే కిడ్నాప్ చేసింది. ఆధారాలు ఉన్నాయి. సీఎం జగన్‌కు (Cm jagan) రోజులు దగ్గర పడ్డాయి. అడ్డుగా ఉన్న వారిని అంతు చూడాలని చూస్తున్నారు.’’ అని సీఎం రమేష్ ధ్వజమెత్తారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - 2023-11-21T15:08:54+05:30 IST