Keshineni Chinni యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకి అందరూ రావాలి
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:33 PM
యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకి అందరూ రావాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని చిన్ని ( Keshineni Chinni ) తెలిపారు.
విజయవాడ: యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకి అందరూ రావాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని చిన్ని ( Keshineni Chinni ) తెలిపారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... యువగళం పాదయాత్రకి అత్యంత అద్భుతమైన స్పందన వస్తోంది. 3500 కిలోమీటర్లు ముగింపు సందర్భంగా విశాఖపట్నానికి వెళ్తున్నాం. చంద్రబాబు, లోకేష్, పవన్‌లతో కలిసి ప్రభుత్వం వస్తుంది. ఏపీ ఇబ్బందుల నుంచి బయటకి రావాలని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
దళిత వర్గాలు జగన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: వర్ల రామయ్య
దళిత వర్గాలు సీఎం జగన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ( Varla Ramaiah ) చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో జరగనున్న యువగళం ముగింపు సభకు సన్నాహక ఏర్పాట్లను ఆదివారం నాడు పరిశీలించారు. జగన్‌కి ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి... దళిత వర్గాలకు మాయ మాటలు చెప్పి జగన్ ఓట్లేయించుకున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని వర్ల రామయ్య పేర్కొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:33 PM