Somu Veerraju: ఆ అర్హత కలిగిన పార్టీ బీజేపీనే
ABN, First Publish Date - 2023-01-28T15:53:14+05:30
2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ బీజేపీ (BJP) నేనని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ
విజయవాడ: 2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ బీజేపీ (BJP) నేనని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అభిప్రాయపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తొండియా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు. ‘‘సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటల దీక్ష చేపట్టింది. మిగిలిన పార్టీలు మీటింగ్‌లు పెట్టి వెళ్లిపోవడమే. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీనే. ఏప్రిల్‌లో ఎస్సీల బహిరంగ సభ విజయవాడలో నిర్వహించబోతున్నాం. జగన్ ప్రభుత్వం (Ycp government) పైన గళమెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎస్సీలను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది. ఏపీలో అభివృద్ధి లేదు.. తిరోగమనం పాలైంది. రాష్ట్రం ప్రభుత్వం నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసేశారు. పైగా వైన్ మాఫియా, శాండ్ మాఫియా వైసీపీ నేతలే చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతి చేస్తూ ట్రేడింగ్ కంపెనీ మాదిరి రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారు. 35 లక్షల ఇళ్లకు లక్షా 80 వేల రుణం కేంద్రమే ఇస్తుంది. జగన్ (Jagan) నవరత్నాలు కన్నా మోదీ సంక్షేమమే ఏపీలో ఎక్కువ. 8 లక్షల కోట్లు ఏపీ (AP)కి అదనంగా కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం. వైసీపీ, టీడీపీలు కేంద్రం చేసిన సాయం ఎందుకు చెప్పడం లేదు. మేం సంక్షేమం చేస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం ప్రజలను చంపేస్తుంది.’’ అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-01-28T15:53:15+05:30 IST