ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Assembly Budget: 2023- 24 బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

ABN, First Publish Date - 2023-03-16T09:02:06+05:30

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం (AP Cabinet Meeting) గురువారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధ్యక్షతన కేబినెట్ మొదలైంది. ఈ సందర్భంగా 2023 - 24 సాధారణ బడ్జెట్‌ (2023-24 General Budget)కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. బడ్జెట్‌తో పాటు ఉప లోకాయుక్త నియామకంలో మార్పులకు సంబంధించిన డ్రాప్ట్‌ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముందుగా శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ , కుతూహలమ్మ, పాతపాటి సర్రజుతో పాటు మరో ముగ్గురు సభ్యుల మృతి పట్ల సభ సంతాపం తెలుపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు శాసనసభలో 2023- 24 వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఆపై నున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (Minister Nunna Kakani Govardhan Reddy) వ్యవసాయ బడ్జెట్‌ (Agriculture Budget)ను సభలో ప్రవేశపెడతారు. అటు శాసనమండలిలో ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా (Deputy CM Anjad Basha) వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పలరాజు (Minister Sidiri Appalaraju) మండలి ముందు ఉంచనున్నారు.

బడ్జెట్ ప్రతులకు పూజలు...

అంతుకుముందు 2023 - 24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బయల్దేరి వెళ్లారు. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు అధికారులతో కలిసి బుగ్గన సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో బడ్జెట్ ప్రతులకు బుగ్గన, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పేద ప్రజలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం: బుగ్గన

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ...పేద ప్రజలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పరిపాలనా పరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు ఉంటాయన్నారు. ఉన్న పధకాలను బలపరిచేలా మరింత మందికి అవకాశం ఇచ్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

Updated Date - 2023-03-16T09:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising