ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Botsa: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్‌న్యూస్ చెప్పిన బొత్స

ABN, First Publish Date - 2023-04-21T14:10:04+05:30

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ (AP Governemtn) శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను (DSC Notification) విడుదల చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ప్రకటించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్స్ బదిలీలపై సమీక్షించామని.. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అంశంపై పరిశీలిస్తున్నామన్నారు. సీఎం జగన్ దీని పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. విద్యార్థులుకు రాగి జావా నిలిపివేశామంటూ వస్తున్న ప్రచారం తప్పు అని.. తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పుకొచ్చారు. పరీక్షలు, ఒంటి పూట బడుల వలన ప్రస్తుతానికి రాగిజావాకు బదులు చిక్కీలు ఇస్తున్నామని మంత్ర బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Updated Date - 2023-04-21T14:10:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising