ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodikatti case: కోడికత్తి కేసులో బిగ్ ట్విస్ట్! సడన్‌గా ఈ ఛేంజ్ ఎందుకో..!

ABN, First Publish Date - 2023-08-01T16:28:15+05:30

కోడికత్తి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసును విజయవాడ నుంచి విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి కోడికత్తి కేసు విచారణ విశాఖ ఎన్‌ఐఏ కోర్టు చేపడుతుందని న్యాయమూర్తి వెల్లడించారు.

విజయవాడ: కోడికత్తి కేసు (Kodikatti case)లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసును విజయవాడ నుంచి విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ విజయవాడ ఎన్‌ఐఏ(NIA) కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి కోడికత్తి కేసు విచారణ విశాఖ ఎన్‌ఐఏ కోర్టు చేపడుతుందని న్యాయమూర్తి వెల్లడించారు. ఇప్పటికే కేసులో 80 శాతం విచారణ పూర్తయిందని.. కేసులో ప్రత్యక్ష సాక్షి సీఎం జగన్ నేరుగా కోర్టులో హాజరై సాక్ష్యం చెబితేనే కేసు ముందుకు సాగుతుందని నిందితుడు తరపు న్యాయవాదులు వాదించారు. లేని పక్షంలో కేసు విచారణ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందంటుని నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది అబ్దుస్ సలీం పేర్కొన్నారు. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నిర్ణయంతో కోడి కత్తి కేసు మరలా మొదటికి వచ్చిందని నిందితుడు తరపు న్యాయవాది అబ్దుస్ సలీం వాపోయారు.

ప్రస్తుత సీఎం జగన్.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి జరిగింది. నిందితుడు శ్రీనివాసరావును అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అప్పటి నుంచీ ఈ కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ సాగుతూ వచ్చింది. తాజా నిర్ణయంతో ఇంకెన్ని రోజులు విచారణ జరుగుతుందోనని నిందితుడి తరుపు న్యాయవాదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-08-01T16:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising