MLC Election Counting: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌పై చంద్రబాబు పర్యవేక్షణ
ABN, First Publish Date - 2023-03-17T09:22:05+05:30
టీడీపీ పోటీ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు.
అమరావతి: టీడీపీ(TDP) పోటీ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ Graduate MLC Election Counting) ప్రక్రియపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు (TDP Chief) ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్‌కే మీనా (The Chief Electoral Officer of the state is MK Meena), అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ (Anantapur District Collector Nagalakshmi), ఎస్పీ ఫకీరప్ప (SP Fakirappa) లతో టీడీపీ అధినేత ఫోన్‌లో మాట్లాడారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్‌లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి... టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ (YCP) శ్రేణులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్ధమైందని ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, ఎన్నిక బాధ్యులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2023-03-17T09:22:05+05:30 IST