ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: చంద్రబాబు, పవన్, మీడియాపై జగన్ అక్కసు

ABN, First Publish Date - 2023-05-22T12:58:49+05:30

బందరు పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడితే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: బందరు పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడితే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దేవతల యజ్ఞానికి రాక్షసులు అడ్డుపడ్డట్టు టీడీపీకి (TDP) తోడు, ఓ గజదొంగల ముఠా అడ్డుపడుతూ వచ్చారన్నారు. ఈ టీడీపీతో పాటు కొన్ని ఛానళ్లు, దత్తపుత్రుడు అడ్డుపడుతూ వచ్చారని తెలిపారు. రాజధాని పేరు మీద కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పేదలకు ఏమాత్రం ప్రవేశం లేని ఓ గేటెడ్ కమ్యూనిటీని గవర్నమెంట్ డబ్బుతో కట్టు కోవాలనుకుంటున్నారని ఆరోపించారు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు, గజదోంగల ముఠా ప్రయత్నించారన్నారు. బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే అక్కడ పేద వర్గాలు కేవలం పాచిపనులు చేయాలన్నారు.

‘‘రోజువారీ పనులు చేసే కార్మికులుగా ఉండాలని, వారు ఎవ్వరికి అక్కడ ఇళ్లు ఉండకూడదట.. వారు పోద్దున్నే అక్కడ ఎంటరై అక్కడి వారికి పనులు చేసి తిరిగి సాయంత్రం వెళ్లి పోవాలట. పేదలకు ఇల్లే లేకుండా, ఇల్ల స్థలాలే లేకుండా చేసే వికృత ఆలోచనలకు మనం మద్దతు ఇవ్వగలమా అని అడుగుతున్నా. అందుకే ఆ పేదల తలరాతలు మార్చేందుకు 50 వేల మందికి ఇల్ల స్ధలాలు ఇవ్వడమే కాకుండా స్వయంగా ఇల్లు కూడా కట్టిస్తాం. ఈనెల 26న, అంటే నాలుగు రోజుల్లో అక్కడికి వెళ్లి ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తాను. పేదలు అంటే చంద్రబాబుకు ఎంతో చులకన. మూడు రాజధానులు వద్దని అన్ని ప్రాంతాలను అవమానించాడు చంద్రబాబు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తుంటే కోర్టుల్లోకి వెళ్లి కేసులు వేయించాడు చంద్రబాబు. విశాఖపట్నంలో చంద్రబాబు అన్న మాటలు చాలా భాదను కలిగిస్తోంది. అమారావతి పరిధిలో 50 వేల మందికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుంటే ఆ స్థలాన్ని సమాధులు కట్టుకునే స్థలం అని చంద్రబాబు అంటాడు’’ అంటూ నిజాలు చెప్పే మీడియాపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు.

బందరుపోర్టు చిరకాల స్వప్నమన్న సీఎం..

సోమవారం బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... బందరుపోర్టు ఒక చిరకాల స్వప్నమన్నారు. బందరుతో సముద్ర వర్తకానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. అన్ని కోర్టు కేసులను పరిష్కరించి, భూ సేకరణ పూర్తిచేసి, అన్ని అనుమతులు తెచ్చి, టెండర్లు ప్రక్రియ ముగించి పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పుకొచ్చారు. నాలుగు బెర్తులతో ఈ పోర్టు ఉంటుందని.. ఇక్కడ ట్రాఫిక్‌ పెరిగే కొద్ది బెర్తులు పెంచుకుంటూ పోతామని తెలిపారు. ఈపోర్టుకు కనెక్టివిటీని పెంచుతామని... గుడివాడ మచిలీపట్నం రైల్వే లైన్‌ను అనుసంధానం చేస్తామన్నారరు. బందరు కాలువ నుండి నీరు అందిస్తామన్నారు. ఈ పోర్టు వల్ల ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా బాగుపడతాయని తెలిపారు. తెలంగాణ, కర్నాటక, ఛత్తీష్ ఘడ్‌కు బందరుపోర్టు ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు.

ఈ పోర్టు నిర్మాణానికి చంద్రబాబు అనేక అడ్డంకులు కల్పించారని మండిపడ్డారు. ఇక్కడ పోర్టు రాకపోతే, ఇక్కడి ప్రజలు బాగుపడకపోతే అందరూ అమరావతిలో ఉన్న బినామీ భూములు రేటు పెంచుకోవచ్చని అనుకున్నారన్నారు. అమరావతి పేరుతో మచిలీపట్నానికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. పోర్టు నిర్మాణానికి గ్రహణాలు అన్ని తొలగిపోతున్నాయన్నారు. మరో 24 నెలల్లోనే మచిలిపట్నంలో పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయని తెలిపారు. గతంలో బందరు ముఖ్యమపట్టణం అయినా ఇక్కడ ఎవ్వరూ ఉండే వారు కాదన్నారు. ప్రస్తుతం ఫిషింగ్ హర్బర్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇమిటేషన్ జ్యువలరీ పరిశ్రమకు మద్దతుగా కరెంటు చార్జీలను తగ్గించామన్నారు. చదువుకున్న పిల్లలు అందరికి ఈ పోర్టుల వల్ల ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-05-22T13:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising