ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: సజ్జల కుమారుడికి పాదయాత్ర దృశ్యాలు.. లోకేష్‌కు ప్రాణహాని అంటున్న టీడీపీ.. అసలేం జరుగుతోంది?

ABN, First Publish Date - 2023-02-11T13:09:22+05:30

టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నేత లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర (YuvaGalam)ను పోలీసులు పదే పదే అడ్డుకోవడం పట్ల టీడీపీ నేతలు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శనివారం ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ (Governor Biswabhusan harichandan) ను తెలుగుదేశం పొలిట్‌‌బ్యూరో సభ్యులు కలిశారు. లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)కు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ గవర్నర్‌ (AP Governor)కు నేతలు ఫిర్యాదు చేశారు. లోకేష్‌ (YuvaGalam)కు ప్రాణహాని తలపెట్టే కుట్ర జరుగుతోందని ఫిర్యాదులో తెలిపారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఇప్పటి వరకు డీజీపీని కలిసే అవకాశం రానందున ఆయన్ని కలిసే అవకాశం కల్పించమని గవర్నర్‌ను తెలుగు దేశం నేతలు కోరారు.

పోలీసులు అడుగడుగునా పాదయాత్ర (YuvaGalamLokesh)కు అడ్డంకులు సృష్టించటం, ప్రజలతో మాట్లాడకుండా మైక్ నియంత్రించడం, కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలను గవర్నర్ దృష్టికి టీడీపీ బృందం తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఫిర్యాదుపై తప్పక న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 18 సార్లు ఫిర్యాదు చేశామని, వేటిలోనూ తమకు న్యాయం జరగలేదని గవర్నర్‌కు తెలుగు దేశం నేతలు వివరించారు. నిఘా ముసుగులో పోలీసులు డ్రోన్ల ద్వారా లోకేష్ లేని చోట చిత్రీకరిస్తున్న దృశ్యాలు గవర్నర్‌కు అందజేశారు. టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర (Kollu Ravindra), నక్కా ఆనంద్ బాబు (Nakka Anand babu), బోండా ఉమా (Bonda Umamaheshwar Rao), వర్ల రామయ్య (Varla Ramaiah) రాజభవన్‌ (Rajbhavan)లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.

లోకేష్‌కు ప్రాణహానీ ఉంది: నక్కా

లోకేష్‌కు ప్రాణహానీ ఉందనే ఆందోళన కలుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. సజ్జల (Sajjala Ramakrishnareddy) కుమారుడు భార్గవ్ (Bhargav) ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తోందని తెలిపారు. పోలీసులే డ్రోన్ల ద్వారా పాదయాత్ర ముందు దృశ్యాలు తీసి భార్గవ్‌కు పంపుతున్నారని అన్నారు. ఈ దృశ్యాల ద్వారా ఎక్కడెక్కడ భద్రతా లోపాలు ఉన్నాయో చూసుకుని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పోలీసుల దుశ్చర్యల ఆధారాలు గవర్నర్‌కు నివేదించామన్నారు.

మా సహనాన్ని పరీక్షించవద్దు: బోండా ఉమా

వైసీపీ పోలీసు గూండాలతో యువగళం పాదయాత్రని అణగదొక్కే తీరును గవర్నర్‌కు సమగ్రంగా నివేదించామని మరోనేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు కొల్లి రఘురామరెడ్డి అనే డీఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ నియమించిందన్నారు. కొల్లి రఘురామరెడ్డి (Kolli RaghuramaReddy) అక్రమాల చిట్టా అంతా తమ వద్ద ఉందని... త్వరలోనే దానిని బయటపెడతామని తెలిపారు. తాడేపల్లి సలహాదారులు చెప్పినంత మాత్రాన తెలుగుదేశం కార్యకర్తలపై చెయ్యేసే హక్కు పోలీసుకెక్కడిదని ప్రశ్నించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని బోండా ఉమా హెచ్చరించారు.

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subrahmanyam), గౌతమ్ సవాంగ్‌ (Gowtam sawang)ల పరిస్థితి ఏమైందో అధికారులు ఆలోచన చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే రేపటి నుంచి రోడ్డెక్కి ఉద్యమిస్తామన్నారు.

వర్ల రామయ్య మాట్లాడుతూ... సర్కస్‌లో జోకర్లలా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును గవర్నర్‌కు నివేదించామన్నారు. పోలీసులు సృష్టిస్తున్న అడ్డంకులపై తాను మీడియాలో చూస్తున్నానని గవర్నర్ అన్నారని తెలిపారు.

Updated Date - 2023-02-11T13:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising