ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni uma: ఆ రెండు దుర్ఘటనల్లో కుట్ర జరిగింది

ABN, First Publish Date - 2023-01-05T15:21:00+05:30

సీఎం జగన్‌ (Cm jagan)పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma Maheswara Rao) ఫైరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం (Ycp Government)పై మండిపడ్డారు. ‘‘జగన్‌రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి

కుట్ర జరిగింది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: సీఎం జగన్‌ (Cm jagan)పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma Maheswara Rao) ఫైరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం (Ycp Government)పై మండిపడ్డారు. ‘‘జగన్‌రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి చీకటి జీవో జారీ చేయడం దుర్మార్గపు చర్య. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం తప్పులు చేసి.. నేడు చంద్రబాబు (Chandrababu) యాత్రలు, లోకేష్ యువగళం (Lokesh) అడ్డుకోవడానికి జీవోలు తీసుకొచ్చింది. పోలీసులు మనసు చంపుకొని పని చేస్తున్నారు. వ్యవస్థలను కాపాడుకోవటానికి వెంకట స్వామి లాంటి ఒక్క పోలీస్ చాలు. పోలీస్ భద్రతా డబ్బులు కూడా లోటస్‌ పాండ్ భవనాలు కట్టడానికి ఉపయోగిస్తున్నారు. నిజాం నవాబులు కూడా ఇంత భోగాలు అనుభవించలేదు. నియంతగా పాలన చేస్తూ అందరినీ బెదిరించి పాలన చేస్తున్నారు. బ్రిటిష్ వారి కంటే దారుణంగా జగన్ పాలన చేస్తున్నారు. తిరుమల కొండ మీద కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి(ttd) కళ్లు తెరిచాడు కాబట్టే అవినీతికి ఒక అధికారి బలయ్యాడు. ప్రజల కట్టిన పన్నుల డబ్బులతో ఐదు ప్యాలెస్‌లు కడుతున్నారు. మద్రాస్‌లో అడయార్ దగ్గర పెద్ద ప్యాలెస్ కడుతున్నారు. దేశంలో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో జగన్ రెడ్డి 373 కోట్లు పన్ను కడుతున్నారు. చివరకు ఒక ఎన్నారై కానుకలు ఇస్తే తగిన బందోబస్తును పెట్టలేక పోయారు. ప్రజలు చనిపోవడానికి కారణం ప్రభుత్వమే. గుంటూరు, కందుకూరు ఘటనల్లో కుట్ర జరిగింది. జగన్ పని అయిపోయింది. అందుకే ఇలాంటి విపరీత బుద్ధులు. రాబోయే రోజుల్లో ప్రజల తిరుగుబాటు చేసి తగిన విధంగా బుద్ధి చెబుతారు. తనను పోలీసులు ఎందుకు ఆపుతున్నారో లిఖితపూర్వకంగా ఇవ్వండి లేదంటే న్యాయస్థానం తలుపులు తడతా.’’ నంటూ దేవినేని ఉమ హెచ్చరించారు.

Updated Date - 2023-01-05T15:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising