ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna: టీడీపీలో తన స్థానం ఏంటనే విషయంపై కన్నా కీలక వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-02-21T13:06:39+05:30

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఈనెల 23న టీడీపీలో చేరనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బీజేపీ (BJP)కి రాజీనామా చేసిన ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ (Former BJP Leader Kanna Laxminarayana) ఈనెల 23న టీడీపీ (TDP)లో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సమక్షంలో కన్నా పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో తన స్థానం ఏమిటనే విషయంపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశంలో తన పాత్ర ఏమిటో పార్టీ తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పార్టీ అధినేత ఏవిధంగా నిర్దేశిస్తే ఆ విధంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

పనిలో పనిగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YCP Chief YS Jaganmohan Reddy)పై కన్నాలక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి (AP CM)దేశంలో అత్యంత ధనిక సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి రాష్ట్ర సంపద దోచుకుంటున్నారని ఆరోపించారు. నవరత్నాలు పంచి ప్రజలు ఓట్లు కొల్లగొడదామని చూస్తున్నారన్నారు. అమరావతి (Amaravati) నుంచి రాజధాని మార్చడం జగన్ దోపిడి కోసమే అని అన్నారు. అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. ఏపీ (Andhrapradesh)ని బీహార్ కంటే అధ్వాన్నంగా తయారు చేస్తున్నారని విమర్శించారు. జగన్ వచ్చిన మరుక్షణం నుంచి ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. వైసీపీ (YCP) అరాచకాలకు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం ఉంటే ఎందుకు ప్రతిపక్షాలను చూసి భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా పోలీసులు ప్రజలకు సేవచేయాలని లేకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. మోదీ నాయకత్వం బాగున్నా ఏపీ బీజేపీ (AP BJP) నాయకత్వం సరిగా లేదని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-02-21T15:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising