ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodali Nani: చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది

ABN, First Publish Date - 2023-09-10T20:46:37+05:30

స్కిల్ స్కాంలో చంద్రబాబు (Chandrababu)కు రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) స్పందించారు.

కృష్ణా జిల్లా గుడివాడ: స్కిల్ స్కాంలో చంద్రబాబు (Chandrababu)కు రిమాండ్ విధించడంపై మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) స్పందించారు. ఆదివారం నాడు వైసీపీ పార్టీ(YCP party) కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ..‘‘ నన్ను ఎవరూ ఏం చేయలేరు అనుకుంటున్నా చంద్రబాబు అహంకారానికి కోర్టు తీర్పు చెంపపెట్టు. నేడు అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజు..... ప్రపంచంలోని ఎన్టీఆర్(NTR) విగ్రహాల నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. లక్షల మంది పిల్లల సొమ్మును దోచుకుతున్న చంద్రబాబు.... లోకేష్‌(Lokesh)కు ధారాదత్తం చేశాడు. తనలోని దొంగ స్కిల్స్ అన్నీ ఉపయోగించి..... స్కిల్ డెవలప్‌మెంట్(Skill development) సొమ్మును చంద్రబాబు దోచుకున్నాడు. చంద్రబాబును జైలుకు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని..... లోకేష్ తన రెడ్ బుక్‌లో రాసుకోవాలి. సాక్షాలతో చంద్రబాబుని పట్టుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY)కి ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానీగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌కు క్షోభ పెట్టిన చంద్రబాబు, అదే వయసులో జైలుకెళ్తున్నాడు. ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నాడు తండ్రిని క్షోభ పెట్టిన చంద్రబాబు కాళ్ల వద్దకు చేరారు. దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరన్నది చంద్రబాబు విషయంలో నిరుపితమైంది. ఎన్నికలవేళ సింపతి వస్తుందని కూడా ఆలోచించకుండా...... అవినీతిపరుడు చంద్రబాబుపై సీఎం జగన్ దర్యాప్తు చేయించారు. అవినీతి ఎవరు చేసిన ఉక్కు పాదంతో అణిచివేస్తానని జగన్ నిరూపించారు’’ అని కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-10T20:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising