కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kollu Ravindra: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్

ABN, Publish Date - Dec 26 , 2023 | 02:13 PM

మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) పై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) హాట్ కామెంట్స్ చేశారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా.. మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా వర్థంతికి రాజకీయ రంగు పులిమారని పేర్ని నానిపై కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Kollu Ravindra: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్

మచిలీపట్నం: మాజీమంత్రి పేర్ని నాని ( Perni Nani ) పై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) హాట్ కామెంట్స్ చేశారు. వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా.. మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగా వర్థంతికి రాజకీయ రంగు పులిమారని పేర్ని నానిపై మండిపడ్డారు. రంగా అభిమానులు డీజే పర్మిషన్ అడిగితే ఇవ్వరా అని ప్రశ్నించారు. పేర్ని నాని కొడుకు డీజేతో ఊరంతా తిరగి రంగా విగ్రహాలకు దండలు వేస్తాడా అని నిలదీశారు. పేర్ని నాని ఏ నాడైనా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాడా అని ప్రశ్నించారు. నాడు రంగా మరణాంతరం నవకళా సెంటర్ ప్రస్తుతం ఉన్న రంగా విగ్రహ ఏర్పాటుని అడ్డుకున్నది ఎవరని నిలదీశారు. రంగా విగ్రహ దిమ్మను తొలగించినది మీ తండ్రి పేర్ని కృష్ణమూర్తి కాదా అని నిలదీశారు. నేడు రంగా పేరుతో రాజకీయం చేస్తుండటం సిగ్గుగా లేదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

Updated Date - Dec 26 , 2023 | 02:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising