Lanka Dinakar: నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా..?
ABN, First Publish Date - 2023-09-23T17:57:48+05:30
నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని ఏపీ బిజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్(Lanka Dinakar) ప్రశ్నించారు.
అమరావతి: నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని ఏపీ బిజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్(Lanka Dinakar) ప్రశ్నించారు. శనివారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం అవినీతిపైన లెక్కలతో సహా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Purandhareswari) నిలదీశారు. పురంధరేశ్వరి ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(cm jagan) సమాధానాలు చెప్పలేని డోలమాయన స్థితిలో ఉన్నారు. కొంతమంది వైసీపీ నేతలతో జగన్ వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారు. మద్య నిషేధం అని చెప్పి అదే మద్యంతో జేబులు నింపుకునే నేతలకు విశ్వసనీయత ఏక్కడిది? 60 వేల కోట్ల మద్యం అమ్మకాలను 32 వేల కోట్లే చూపుతున్నారన్న ప్రశ్నకు సమాధానం ఏది? లక్ష రూపాయల అమ్మకంలో ఏడు వందల రూపాయలు మాత్రమే డిజిటల్ లావాదేవిలేనా అన్న ప్రశ్నకు సమాధానం ఏది? నాసిరకం మద్యం వినియోగంతో మరణాల పైన ప్రశ్నిస్తే సమాధానం ఏది? వ్యక్తిగత దూషణలతో డైవర్షన్ చెయాలి అనుకున్నా మద్యం అక్రమాల నిజాలు నిగ్గు తేల్చే వరకు విశ్రమించేదే లేదు’’ అని లంకా దినకర్ నిలదీశారు.
Updated Date - 2023-09-23T17:57:48+05:30 IST