Jogi Ramesh: పెడనలో నిరసన సెగ
ABN, First Publish Date - 2023-10-05T22:16:21+05:30
మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుడు కట్టా శివాజీ(Katta Shivaji)ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెడనలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కృష్ణాజిల్లా, (పెడన): మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుడు కట్టా శివాజీ(Katta Shivaji)ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెడనలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో మంత్రి జోగి రమేష్‌ని జింజేరు గ్రామస్తులు చుట్టుముట్టారు. జింజేరు గ్రామంలో జోగి రమేష్ ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్తున్న సందర్భంలో టీడీపీ సానుభూతిపరుడైన కట్టా శివాజీ ఇంటికి మంత్రి వెళ్లారు. ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తుంటే టీడీపీ నేతలతో ఎందుకు తిరుగుతున్నావ్ అని శివాజీ దంపతులను జోగి రమేశ్ నిలదీశారు. కోడి పందాలు వేస్తావంటగా నీ సంగతి చూస్తానని జోగి రమేష్ చెప్పి వెళ్లిపోయారు. జోగి రమేష్ వెళ్లిపోయిన వెంటనే శివాజీ ఇంట్లో పెడన ఎస్ఐ సోదాలు చేశారు. కోడి కత్తులు దొరికాయని చెప్పి శివాజీని ఎస్ఐ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా జోగి రమేష్‌ని అడ్డుకున్నారు. జోగి రమేష్ కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన శివాజీని వెంటనే విడుదల చేయాలని మంత్రి కాన్వాయ్ ముందు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నిరసనతో శివాజీని పోలీసులు విడుదల చేశారు.
Updated Date - 2023-10-05T22:16:21+05:30 IST