సైకో పాలనకు చరమ గీతం
ABN , First Publish Date - 2023-01-25T00:24:57+05:30 IST
సైకో దుష్టపాలన నుంచి ప్రజల్ని విముక్తుల్ని చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో నిర్వహించనున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా ఆధ్వర్యంలో పామర్రు వీరాంజనేయ స్వామి ఆలయం, మసీదు, ఆర్‌సీఎం చర్చిల్లో మంగళవారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.

పామర్రు, జనవరి 24 : సైకో దుష్టపాలన నుంచి ప్రజల్ని విముక్తుల్ని చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో నిర్వహించనున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా ఆధ్వర్యంలో పామర్రు వీరాంజనేయ స్వామి ఆలయం, మసీదు, ఆర్‌సీఎం చర్చిల్లో మంగళవారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలని నినదిస్తూ పామర్రులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి లోకేశ్‌ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్ చంద్ర, గొట్టిపాటి లక్ష్మీదాస్, మండపాక శంకర్‌బాబు, దాలిపర్తి ప్రసాద్, వల్లూరిపల్లి గణేష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కేదరాశిపల్లి శ్రీనివాసరావు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, మైనేని ఇందిర, జన్ను శోబాన్‌బాబు, ఈడే నాని, పామర్తి విజయశేఖర్, సుబ్రహ్మణ్యం, వీరంకి మోహనరావు పాల్గొన్నారు.