RIP Viswanath: దర్శకుడు విశ్వనాథ్‌కు రాజకీయ ప్రముఖుల సంతాపం
ABN, First Publish Date - 2023-02-03T10:06:33+05:30
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు మృతితో తెలుగు సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.
అమరావతి: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ (Director K Viswanath)కు మృతితో తెలుగు సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. విశ్వనాథ్ మరణవార్త తెలిసిన వెంటనే సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాలు (Film and political celebrities mourn K Viswanath)తెలియజేస్తున్నారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని అన్నారు. విశ్వనాథ్ చిత్ర పరిశ్రమ (Film Industry)కు గొప్ప పేరు సంపాదించారని కొనియాడారు. ఆయన సినిమాలు విలువలకు ప్రతిరూపాలని అన్నారు. టీడీపీ నేత నక్కా ఆనందబాబు (Nakka Anandbabu, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు (SomuVeerraju), సీపీఐ నేత రామకృష్ణ (Ramakrishna), తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామమోహన్ రావు (Kambhampati RamMohanRao) సంతాపం తెలిపారు.
మా ప్రాంతంలో జన్మించడం మా అదృష్టం: నక్కా ఆనంద్
కళాతపస్వి కె.విశ్వనాథ్ (RIP Viswanath) కన్నుమూయడం చిత్ర పరిశ్రమకి తీరని లోటని అన్నారు. విశ్వనాథ్ తమ ప్రాంతంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి ఎదిగిన విశ్వనాథ్ చిత్ర పరిశ్రమ గొప్ప పేరు సంపాదించారని అన్నారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చినప్పుడు స్వగ్రామంలో ఆయన ఘన సన్మానం చేశామని చెప్పారు. కళాతపస్వి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని.. వారి కుటుంబసభ్యులకు నక్కా ఆనందబాబు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
కళాభిమానులకు తీరని లోటు: సోమువీర్రాజు
తెలుగు వెండితెరపై విభిన్న రకాల కళాత్మక చిత్రాలు రూపొందించి సంగీతం, సాహిత్యం, జానపదం, నృత్యం ,అన్ని రంగాలను, ప్రేక్షకులకు అందించిన "కళాతపస్వి" కె విశ్వనాథ్ మరణం కళాభిమానులకు తీరని లోటన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిత్రాలతో అస్త్రాలు సంధించారు: రామకృష్ణ
కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగు సంస్కృతి, కళల పట్ల ఉన్న అభిమానాన్ని తన చిత్రాల ద్వారా కళాతపస్వి వెల్లడించేవారన్నారు. సమాజంలోని రుగ్మతలపై ఆయన తన చిత్రాల ద్వారా అస్త్రాలు సంధించారన్నారు. కె విశ్వనాధ్ లేని లోటు తెలుగు సినీ రంగానికి తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు సినీ పరిశ్రమకే మణిమకుటం: కంభంపాటి
విశ్వనాథ్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకే మణిమకుటమని అన్నారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటని ఆవేదన చెందారు. కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి దిగ్భ్రాంతికరమన్నారు. ఆయన సినిమాలు విలువలకు ప్రతిరూపాలని కొనియాడారు. మన సంస్కృతి, సంగీత, సాహిత్య విలువలతో కూడిన మణిమకుటమన్నారు. ప్రజా చైతన్యమే సినిమా పరమావధిగా భావించారని... త్రికరణశుద్ధిగా ఆచరించారని తెలిపారు. విశ్వనాథ్ లేని లోటు తీర్చలేనిదని, ఆయన మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన చెందారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు కంభంపాటి రామమోహన్ రావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Updated Date - 2023-02-03T10:11:31+05:30 IST