TDP Leader: జగన్ అండతోనే వైసీపీ రౌడీమూకలు రెచ్చిపోతున్నాయన్న అచ్చెన్న
ABN, First Publish Date - 2023-04-01T10:52:03+05:30
పుట్టపర్తి ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు.
అమరావతి: పుట్టపర్తి ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) అండతో రాష్ట్రంలో వైసీపీ (YCP) రౌడీ మూకలు పెట్రేగిపోతున్నాయని మండిపడ్డారు. పుట్టపర్తిలో టీడీపీ (TDP) కార్యకర్తలపై దాడి చేసి, పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేయటం దుర్మర్గపు చర్య అని అన్నారు. ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారని ఆరోపించారు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలు ఫూటుగా మద్యం తాగి దాడులు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వైసీపీ గూండాల్ని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేయటం ఏంటని నిలదీశారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా అటు పుట్టపర్తిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పుట్టపర్తి అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ (YCP MLA Duddukunta Sridhar), మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి (former minister Palle Raghunath Reddy సవాల్‌తో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం సత్తమ్మ దేవలయానికి చేరుకుంటున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులు ప్రతిదాడులకు దిగారు. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. తోపులాటలో పల్లె రఘునాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని సత్తెమ్మ దేవాలయం వద్దకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
Updated Date - 2023-04-01T10:53:51+05:30 IST