ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni: ‘నీ సైకో ఇజానికి ఎవరూ భయపడటం లేదు జగన్ రెడ్డి...’

ABN, First Publish Date - 2023-02-21T10:54:37+05:30

పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) చూపించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uammaheshwar Rao) విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గన్నవరం ఘటనకు పూర్తిగా జగన్ రెడ్డి (Jagan Reddy), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న బోడే ప్రసాదు (Bode prasad)ను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని, కార్యకర్తలను, నాయకులను లాక్కెళ్లారని మండిపడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో గంజాయి బ్యాచ్ గన్నవరంలో స్వైర విహారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిపాలన, చట్టం లేదని... డీజీపీ ఆఫీస్ మూసేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. డీఐజీ నోరు తెరవడం లేదు.. ఎస్పీ ఫోన్ ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ తమకు సంబంధం లేదని కృష్ణాజిల్లా పోలీసులు చూడాలని వదిలేశారన్నారు. రాష్ట్ర కార్యదర్శి చిన్న ఇంటికి వెళ్లి కారు, స్కూటర్ తగలబెట్టారన్నారు.

‘‘నీ సైకో ఇజానికి ఎవరు భయపడటం లేదు జగన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy). రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మూసేశారు. కొంతమంది ఉన్నతాధికారుల వల్ల ఈ డ్రెస్సు వేసుకున్నందుకు సిగ్గుపడుతున్నామని చెబుతున్నారు. ఖాకి బట్టలు వేసుకున్న వాళ్లు తమలాంటి వాళ్లను అరెస్టు చేసి కార్యాలయాల్లో ఇళ్లల్లో పెట్టేశారు. గన్నవరం ఘటనపై గుండాలను, శాసనసభ్యున్ని అరెస్టు చేయాలి.. చిన్నాకు అక్కడ పార్టీ నాయకులకు పోలీసు భద్రత కల్పించాలి. పైశాచిక ఆనందంతో పట్టాభిని పోలీసులు తిప్పుతున్నారు.. పట్టాభి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ప్రాణాలకు తెగించే పట్టాభి ధైర్యంగా ముందుకు వెళ్లారు. దాన్ని సహించుకోలేక ఈ దుర్మార్గులు దాడులు చేస్తున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు అంతా సంఘీభావం తెలియచేసి అండగా ఉంటారని స్పష్టం చేశారు. పార్లమెంటు అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు నాయకత్వంలో ఈ చర్యలను తిప్పి కొడతామన్నారు. ఇంతకింత వైసీపీ పార్టీ అనుభవిస్తుందని శపించారు. ప్రజల తిరుగుబాటే దీనికి సమాధానం అవుతుందన్నారు. ప్రజలను కార్యకర్తలను, నాయకులను అణగదొక్కలేరని దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-02-21T10:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising