ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: వైసీపీలో ముదిరిన టికెట్ల లొల్లి

ABN, Publish Date - Dec 19 , 2023 | 04:56 PM

విజయవాడ వైసీపీ ( YCP ) లో టికెట్ల లొల్లి ముదిరింది. విజయవాడ వెస్ట్‌లో వెలంపల్లి శ్రీనివాసరావుకి వైసీపీ హై కమాండ్ ఈ సారి ఎన్నికల్లో మొండి చెయి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై వెలంపల్లిని సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. కాగా విజయవాడ సెంట్రల్ నుంచి వెలంపల్లి పేరుని పరిశీలిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం.

అమరావతి: విజయవాడ వైసీపీ ( YCP ) లో టికెట్ల లొల్లి ముదిరింది. విజయవాడ వెస్ట్‌లో వెలంపల్లి శ్రీనివాసరావుకి వైసీపీ హై కమాండ్ ఈ సారి ఎన్నికల్లో మొండి చెయి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై వెలంపల్లిని సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. కాగా విజయవాడ సెంట్రల్ నుంచి వెలంపల్లి పేరుని పరిశీలిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. లేని పక్షంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవి ఇస్తామని సీఎం వెలంపల్లి కి చెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్‌లో మల్లాది విష్ణు‌కు సీట్ బెర్త్ కన్ ఫాం అవలేదని తెలుస్తోంది. విష్ణు స్థానంలో విజయవాడ వెస్ట్ నుంచి ఒక ప్రముఖ కళాశాల అధిపతిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అప్పుడే ఆయన నియోజకవర్గంలో ఫ్లెక్సీలతో హడావుడి చేస్తున్నారు. సర్వే నివేదికలు మీకు అనుకూలంగా లేవని వెలంపల్లికి సీఎం చేపినట్టు సమాచారం. బెజవాడలో వైసీపీలో ఇప్పటి పరిణామాలతో పార్టీ హైకమాండ్‌లో గందరగోళం నెలకొంది. అయితే సదరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ కోసం త్యాగాలు తప్పవని హైకమాండ్ చెబుతోంది. అయితే టికెట్ దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - Dec 19 , 2023 | 04:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising