ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Venigandla Ramu : ఈ రోజు యావత్ తెలుగు జాతికి శుభదినం

ABN, First Publish Date - 2023-10-31T12:15:01+05:30

,స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఈరోజు యావత్ తెలుగు జాతికి శుభదినమని టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము ( Venigandla Ramu ) అన్నారు.

కృష్ణాజిల్లా (గుడివాడ): స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఈరోజు యావత్ తెలుగు జాతికి శుభదినమని టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము ( Venigandla Ramu ) అన్నారు. మంగళవారం నాడు చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడలో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకున్నారు. బైపాస్ రోడ్డులో టపాసులు కాలుస్తూ, జై చంద్రబాబు అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ...‘‘చంద్రబాబు బెయిల్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జగన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టిన న్యాయవాదులకు హ్యాట్సాఫ్. చంద్రబాబుని హింసించిన పాపం, సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలకు తగులుతుంది. ఇది ఆరంభం మాత్రమే. చంద్రబాబు బయటకు రావడంతో టీడీపీ నేతలు ఆత్మస్థైర్యం కొండంత పెరిగింది. తామేంటో చూపిస్తాం. అరాచక వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి’’ అని వెనిగండ్ల రాము అన్నారు.

Updated Date - 2023-10-31T12:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising