ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Keshineni Nani: జగన్ సర్కార్‌పై కేశినేని నాని ఫైర్.. టీడీపీలో ఆసక్తికర చర్చ

ABN, First Publish Date - 2023-08-05T14:57:03+05:30

శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని విజయవాడ టీడీపీ కేశినేని నాని (Keshineni Nani) అభిప్రాయపడ్డారు. రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.

అమరావతి: ఏపీలో శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని విజయవాడ టీడీపీ కేశినేని నాని (Keshineni Nani) అభిప్రాయపడ్డారు. రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై (YCP Government) మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి (PM Modi) ఫిర్యాదు చేస్తామన్నారు. పాలకులు ఎవరైనా అధికారంలోకి రావాలనుకుంటే ఇటువంటి దురాగతాలకు పాల్పడకూడదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో పూర్తి వ్యతిరేకత పెరిగిపోయిందని పేర్కొన్నారు. అందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సామంతుల పరిపాలనలో లేమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని గుర్తుచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు చేసిన చంద్రబాబుపైనే దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే నాటికి హైదరాబాద్‌లో ఇటువంటి పరిస్థితులే ఉండేవని.. హైదరాబాద్‌లో బస్సులు దిగాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే వాటిని కంట్రోల్ చేయడంతో పాటు ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా అదే పందాలో వెళ్లడంతో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. టెర్రరిస్టులను ప్రోత్సహించిన పాకిస్థాన్ దేశం కూడా చివరకు శాంతి భద్రతలు లేకపోవడంతో దేశం బిచ్చమెత్తుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. ఐపీఎస్ అధికారులు సైతం ట్రాన్స్‌ఫర్ల భయంతో వైసీపీ నాయకులు చెప్పినట్టు వింటున్నారని కేశినేని నాని విమర్శించారు.

కేశినేని వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్నామొన్నటి దాకా వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆ పార్టీ నాయకులతో కూడా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్స కార్యక్రమాల్లో పాల్గొని హల్‌చల్ చేశారు. తాజాగా టీడీపీకి, చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడడంపై టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

Updated Date - 2023-08-05T14:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising