Minister Jayaram : మంత్రి జయరాంకి నిరసన సెగ
ABN, First Publish Date - 2023-09-10T21:47:53+05:30
మంత్రి గుమ్మనూర్ జయరాం(Minister Gummanur Jayaram)కి సొంత సెగ్మెంట్‌లో నిరసన సెగ తగిలింది.
కర్నూలు : మంత్రి గుమ్మనూర్ జయరాం(Minister Gummanur Jayaram)కి సొంత సెగ్మెంట్‌లో నిరసన సెగ తగిలింది. దేవనకొండ మండలం కుంకనూరులో గడప గడపకు మంత్రి జయరాం వెళ్లారు. ఈఅ సమయంలో తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని నిలదీశారు. ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రిని చుట్టుముట్టి గ్రామస్తులు నిలదీశారు. స్థానిక యువకులపై మంత్రి జయరాం మండిపడ్డారు. వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌లో కొట్టాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. పోలీసుల సాయంతో మంత్రి జయరాం ముందుకు వెళ్లిపోయారు.
Updated Date - 2023-09-10T21:47:53+05:30 IST