ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ.. అజ్ఞాతంలోకి సర్పంచులు

ABN, First Publish Date - 2023-02-27T10:22:05+05:30

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ మధుసూదన్ ఎన్నికల బరిలో నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ మధుసూదన్ ఎన్నికల బరిలో నిలిచారు. గుట్టపాడు మోహన్ రెడ్డి, భూమా వెంకట వేణుగోపాల్ రెడ్డి అనే సర్పంచులు ఇద్దరూ.. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తు్న్నారు. ఈ క్రమంలోనే సర్పంచులిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఏకగ్రీవం అవుతుందా లేక ఎన్నిక జరగనుందా? అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.

హిందూపురంలో ఫోర్జరీ చేసి.. అడ్డంగా దొరికిపోయి..

అధికార పార్టీ వైసీపీ తరఫున బరిలో ఉన్న హిందూపురం ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకునేందుకు ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు టీచర్లు ఏకంగా జిల్లా విద్యాధికారి(డీఈవో) సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిపోయారు. దీనిని గుర్తించిన డీఈవో.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ మేరకు ముగ్గురు మహిళా టీచర్లపై కేసు నమోదు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హిందూపురంలోని మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరాంరెడ్డికి చెందిన బాలయేసు పాఠశాలలో పనిచేస్తున్న షరీఫాబీ, హాజరాన్‌బీ, గీత.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటుకోసం డీఈవో సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఇటీవల వీటిని పరిశీలించిన డీఈవో మీనాక్షి తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించి, అనంత, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు ఈ నెల 17న హిందూపురం ఇన్‌చార్జి తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మి.. ముగ్గురు టీచర్లపై టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన పాఠశాలలో ఇలాంటివి వెలుగు చూడటంతో అందరూ నివ్వెరపోయారు. అడ్డదారుల్లో గెలవాలన్న కుతంత్రంలో భాగంగానే వైసీపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు.

Updated Date - 2023-02-27T10:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising