ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: రైతుల పాలిట జగన్ శనిలా మారారంటూ లోకేష్ ఫైర్..

ABN, First Publish Date - 2023-05-18T17:03:40+05:30

రైతుల పాలిట సీఎం జగన్ శనిలా మారారని లోకేష్ విమర్శించారు. సీమ రైతులకు నీరు అందిస్తే బంగారం పండిస్తారని, రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. వాతావరణంపై నెపం వేసి జగన్ అసమర్థతను కప్పిపెడుతున్నారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: నంద్యాల రైతులతో టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara lokesh) మాట్లాడారు. రైతుల పాలిట జగన్ శనిలా మారారని లోకేష్ విమర్శించారు. సీమ రైతులకు నీరు అందిస్తే బంగారం పండిస్తారని, రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. వాతావరణంపై నెపం వేసి జగన్ అసమర్థతను కప్పిపెడుతున్నారని విమర్శించారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ కుడి చేతి భుజం ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్టును వైద్యులు పరిశీలించారు. స్కానింగ్ రిపోర్టులో భుజానికి పెద్ద ప్రమాదంలేదని తెలిపారు. తీవ్రమైన భుజం నొప్పి కారణంగా ఈరోజు ఉదయం లోకేష్ ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ తీయించుకున్నారు. నొప్పి తీవ్రమైన నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఆయన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుడి చేతి భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు. కదిరిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఫోటోలు దిగేందుకు అభిమానులు లోకేష్.. కుడి చేయి భుజాన్ని బలంగా లాగారు. దీంతో అప్పటి నుంచి ఆయనకు భుజం నొప్పి మొదలైంది.

నొప్పి తీవ్ర ఎక్కువగా ఉండటంతో ఈరోజు ఉదయం నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో లోకేష్ కుడి భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. 50 రోజులుగా కుడి భుజం నొప్పితో లోకేష్ బాధపడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కార్యకర్తల తోపులాట జరిగింది. ఈ సమయంలోనే సెల్ఫీ కోసం అభిమానులు ఆయన భుజాన్ని బలంగా లాగడంతో గాయమైంది. అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే యువనేత పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గడం లేదు. ఈ క్రమంలో ఉదయం నంద్యాల పద్మావతి నగర్‌లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్‌కు చేరుకున్న లోకేష్ భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు.

కాసేపటి క్రితమే ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్టులు రావడంతో వాటిని వైద్యులు పరిశీలించారు. స్కానింగ్ రిపోర్టులో భుజానికి పెద్ద ప్రమాదంలేదని తెలిపారు. ఫిజియోధెరఫీ, ఐస్ ప్యాక్, హీట్ ప్యాక్, మెడిసిన్ వాడితే భుజం గాయం మానుతుందని వైద్యులు తెలియజేశారు.

Updated Date - 2023-05-18T17:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising